News December 1, 2025

బాధితుల సమస్యలను పరిష్కరించాలి: ADB SP

image

ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యత అధికంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 28 ఫిర్యాదులు అందగా వాటిని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్‌కు తెలియజేయలన్నారు. ఆయనతో పాటు సీసీ కొండరాజు ఉన్నారు.

Similar News

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో బీజేపీకి భంగపాటు

image

ఆదిలాబాద్‌‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.

News February 16, 2026

ఆదిలాబాద్‌ వైస్ ఛైర్మన్‌గా ఎండీ రోహిత్

image

ఆదిలాబాద్‌ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బండారి అనూష

image

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఛైర్‌పర్సన్‌గా 45వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ఎన్నికలో ఆమెకు 27 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర సభ్యులు అనూషకు మద్దతు తెలిపారు.