News June 15, 2024

బాధ్యతలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా: ప్రత్తిపాటి

image

నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి తనకు అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా అమలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఎమ్మెల్యేను నియోజకవర్గంలోని పలువురు టీడీపీ శ్రేణులు కలిసి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తానని, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు.

Similar News

News October 2, 2024

చుండూరు: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

image

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. తెనాలి నుంచి చుండూరు మధ్య గల రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 2, 2024

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు

image

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అంబటి మురళి, మరో 12 మంది సెప్టెంబర్ 28న పట్టణంలోని శ్రీసహస్రలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిరసన ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు భక్తులను లోపలకు వెళ్లనివ్వకుండా ధర్నా చేశారని టీడీపీ నాయకుడు నరేశ్ ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

News October 2, 2024

గుంటూరు: 97.22 శాతం మందికి పింఛన్ల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో మొదటి రోజు 97.22 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు రూ.4వేలు చొప్పున అందజేశారు. జిల్లాలో 2,56,017 మంది పింఛన్ దారులకు రూ.109.19కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2,48,901 మందికి రూ.106.10కోట్లు పంపిణీ చేశారు.