News April 15, 2025

బాన్సువాడ: అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

image

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాన్సువాడ కల్కి చెరువులో గంగమణి(45) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంతో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Similar News

News December 31, 2025

NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

image

నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్‌లో చదివారు. రెండో అటెంప్ట్‌ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్‌గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్‌గా పని చేశారు.

News December 31, 2025

Khaleda Zia: ఇండియాలో పుట్టి.. ఇండియా వ్యతిరేకిగా మారి..

image

బంగ్లాదేశ్ Ex PM <<18709090>>ఖలీదా జియా<<>>(80) నిన్న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో పుట్టిన ఆమె భారత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. PMగా పదేళ్లలో గంగా జలాలు, వలసదారులు వంటి ఎన్నో అంశాల్లో మనతో ఘర్షణలకు దిగారు. భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాలో ఆశ్రయమిచ్చారు. పాక్, చైనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నాడు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి. హసీనా హయాంలో పరిస్థితి మారింది.

News December 31, 2025

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ‘ఫ్యూచర్ విజన్-2026’

image

విజయవాడ పోలీస్ కమిషనరేట్ నగర భద్రతను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ విజన్-2026’ను ప్రకటించింది. స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్విజిబుల్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ ప్రొటెక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ, ముందస్తు నేర నివారణ, డ్రోన్ నిఘా, ప్రవర్తనా విశ్లేషణలతో ప్రజలకు కనిపించకుండా భద్రత కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు.