News April 8, 2025
బాన్సువాడ: గుండెపోటుతో హోంగార్డు మృతి

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సాయిలు(55) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన సోమవారం విధులు నిర్వహించి స్వగ్రామమైన దేశాయిపేట్‌లోని ఇంటికి వెళ్లారు. తరువాత ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హోంగార్డు సాయిలు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News July 4, 2025
NLG: ‘కొమురయ్య పోరాట పటిమ ఆదర్శప్రాయం’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని సీపీఎం నేతలు నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
News July 4, 2025
BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా?: ఖర్గే

TG: దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని AICC చీఫ్ ఖర్గే అన్నారు. ‘పాక్‌ను ఇందిరా గాంధీ రెండు ముక్కలు చేశారు. మరి మోదీ ఏం చేశారు? PAKను అంతం చేస్తామని చెప్పి యుద్ధాన్ని ఆపారు. 42 దేశాల్లో పర్యటించిన ఆయన మణిపుర్ ఎందుకు వెళ్లలేదు? ఆయనకు బిహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లున్నారు. BJP, RSSలో ఉన్నారా?’ అని HYDలో ప్రశ్నించారు.
News July 4, 2025
కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

KNR, జ్యోతినగర్‌లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్‌లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్‌లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.