News March 26, 2025

బాన్సువాడ: పెళ్లైన నెలకే నవవధువు ఆత్మహత్య

image

బాన్సువాడ కొల్లూరులో లక్ష్మి, వెంకటేశ్‌లకు FEB 23న వివాహం జరిగింది. అయితే ఇష్టంలేని పెళ్లి చేయడంతోనే లక్ష్మి మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ అశోక్ తెలిపారు. సూసైడ్ అటెంప్ట్ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News March 29, 2025

నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మెండోరాలో 41.5℃, పెర్కిట్, మోర్తాడ్, కోటగిరి 41.4, మల్కాపూర్, వేంపల్లె 41.3, లక్మాపూర్, యడపల్లి 41.2, ముప్కాల్, వైల్పూర్ 41.1, కమ్మర్పల్లి, యర్గట్ల, కొండూరు 41, బాల్కొండ 40.9, మంచిప్ప 40.8, గోపన్నపల్లి, తొండకూర్ 40.7, మోస్రా, మగ్గిడి 40.5, రెంజల్, సిరికొండ, భీంగల్, మాచెర్ల 40.4, ధర్పల్లి, గన్నారం, కోనసమందర్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 29, 2025

NZB: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో మృతి చెందినపై ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ 1వ టౌన్ SHO రఘుపతి కోరారు. ఇతను నెహ్రు పార్క్ ఏరియా దగ్గర ఉన్న లేబర్ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తు ఉంటాడన్నారు. శుక్రవారం ఖలీల్వాడి, నిజామాబాద్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని చెప్పారు. ఇతడి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.

News March 29, 2025

NZB: అక్రమంగా విక్రయిస్తున్న రెండు గంజాయి పట్టివేత

image

అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.

error: Content is protected !!