News March 29, 2025
బాన్సువాడ: పైపులతో కొట్టి హత్య చేశారు

బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విట్టల్ శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. సీఐ అశోక్ వివరాలు.. కొల్లూరు శివారులో ఇద్దరు వ్యక్తులతో కలిసి విట్టల్ మద్యం తాగారు. అనంతరం వారు విట్టల్‌ను పైపులతో కొట్టి హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదం జరిగినట్లు ప్రయత్నించారు. మృతుడి సోదరుడు సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతుని భార్యను, మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.
Similar News
News September 18, 2025
జగిత్యాల: ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న చైన్‌స్నాచర్లు

JGTL(D)లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల పోరండ్లలో వృద్ధురాలు బంగారం కోల్పోయిన ఘటన మరవకముందే మరో దొంగతనం వెలుగులోకి వచ్చింది. JGTL(R) సంఘంపల్లేకు చెందిన నేరెళ్ల లచ్చవ్వ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగుడు.. మనవడిగా మభ్యపెట్టి నీళ్లు తీసుకున్నాడు. క్షణాల్లోనే ఆమె మెడలో ఉన్న తులం నర పుస్తెలతాడు లాక్కెళ్లాడు. వృద్ధులను స్నాచర్లు టార్గెట్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
News September 18, 2025
మరికాసేపట్లో నీరజ్ ఫైనల్ ఈవెంట్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్ సా.3.53 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియా తరఫున నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. ఫైనల్ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే జూలియన్ వెబెర్(జర్మనీ) పెటెర్స్(గ్రెనెడా), అర్షద్ నదీమ్(పాక్) నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. వారందరినీ వెనక్కి నెట్టి అతడు బంగారు పతకం సాధించాలని కోరుకుందాం.
ALL THE BEST NEERAJ(హాట్‌స్టార్‌లో లైవ్)
News September 18, 2025
భూగర్భ జలాలను పెంచాలి: గోదావరి డెల్టా ఛైర్మన్

భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి భూగర్భ జలాలు పెంచేందుకు తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చెరువులు కాలువల్లో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు.