News July 9, 2025
బాన్సువాడ: పొలంలో పడి ఊపిరాడక మృతి చెందిన వ్యక్తి

బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామానికి చెందిన గెంట్యల బసవయ్య(41) మంగళవారం ఉదయం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో ముఖం బురదలో కూరుకపోయింది. దీంతో ఊపిరాడక బసవయ్య మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు.
Similar News
News July 9, 2025
జాతీయ అవార్డుకు ధర్మవరం డిజైనర్ ఎంపిక

ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ నాగరాజు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషన్ ప్రకటించిన డిజైన్ డెవలప్మెంట్ మార్కెటింగ్ అవార్డులకు గాను తనను ఎంపిక చేశారని నాగరాజు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు.
News July 9, 2025
దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్‌గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్‌లో<<>> పర్యటించారు.
News July 9, 2025
కొత్తపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ గోండుగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి అను ఉరివేసుకొని మంగళవారం మృతి చెందింది. మోతుగూడెం ఎస్సై కథనం మేరకు.. కొత్తపల్లి పంచాయతీ గొందిగూడెం గ్రామానికి చెందిన MLT విద్యార్థిని రోజు మాదిరిగానే రంపచోడవరం కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చింది. అనంతరం వారి పొలానికి వెళ్లి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.