News October 17, 2024
బాన్సువాడ: మృతి చెందిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి
బాన్సువాడ అటవీ రేంజ్ పరిధిలో పని చేస్తున్న నిజాంసాగర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి (ఎఫ్ఎస్ఓ) గులాం దస్తగిరి(58) విధులు నిర్వహిస్తూ మృతి చెందారు. విధుల్లో ఉన్న ఆయన బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే దస్తగిరిని బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ దస్తగిరి మృతి చెందారు. ఫారెస్ట్ జిల్లా డివిజన్ అధికారులు దస్తగిరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
Similar News
News January 2, 2025
మాచారెడ్డి: రెసిడెన్షియల్ కోసం ఫేక్ ఆధార్..
రెసిడెన్షియల్ కోసం మీసేవ నిర్వాహకుడు డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసిన ఘటన మాచారెడ్డి మండలం ఘన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ముహమ్మద్ షరీఫ్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం మీసేవ నిర్వాహకుడి సాయంతో డూప్లికేట్ ఆధార్ తయారు చేశారు. భార్యాభర్తల ఆధార్ నంబర్ సేమ్ ఉండడంతో RI రమేశ్ PSలో ఫిర్యాదు చేశారు.
News January 2, 2025
NZB: ఎస్సీ వర్గీకరణ వద్దని న్యాయమూర్తికి నివేదిక అందజేత
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ జస్టిస్ షమీం అక్తర్ కమిటీకి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దౌలత్ చక్రే మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను ఐక్యమత్యంగా ఉండకూడదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేసిందన్నారు. 15% ఉన్న రిజర్వేషన్లను 22 % కు పెంచాలని డిమాండ్ చేశారు.
News January 2, 2025
రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.