News June 19, 2024
బాన్సువాడ: రూ.2.09లక్షలు పొగొట్టుకున్న యువకుడు

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు రూ.2.09 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన మహేందర్ ఫోన్‌కు ఈనెల 8న ఓ మెసేజ్ వచ్చింది. క్లిక్ చేయడంతో రూ.400 బోనస్ అతని అకౌంట్లో జమయ్యాయి. దీన్ని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ.2.09 లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఎలాంటి రిఫండ్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News February 28, 2026
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.