News February 1, 2025
బాన్సువాడ: శంకుస్థాపన చేయనున్న హైకోర్టు జడ్జీలు

బాన్సువాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూతన భవన నిర్మాణానికి శనివారం రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జే.శ్రీనివాస్ రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయనున్నట్లు బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ, బిచ్కుంద కోర్టు పరిధిలోని న్యాయవాదులు సిబ్బంది హాజరుకావాలన్నారు.
Similar News
News November 4, 2025
మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

రానున్న 2-3 గంటల్లో నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముండగా, ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీలోపు ఉండే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News November 4, 2025
కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: జగన్

కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ. 40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.5 వేలు ఇచ్చి రైతు వెన్ను విరిచారు అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉచిత ఇన్సూరెన్స్ ఉండేదని, ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనే పరిస్థితి వచ్చిందని, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
News November 4, 2025
తిరుపతి: విధుల నుంచి ఇద్దరు టీచర్లు తొలగింపు

తిరుపతి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా సమాచారం లేకుండా ఉద్యోగానికి రావడం లేదు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి ZP హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు ఏ.బాలకృష్ణ. రేణిగుంట మండలం గుండ్లకలువ MPPS SGT టీచర్ పి.దేవరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


