News August 22, 2025
బాన్సువాడ: హోటల్‌లో పెచ్చులూడాయ్.. తప్పిన ప్రమాదం

బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న హోటల్ క్యాంటీన్ స్లాబ్ పెచ్చులూడి పడ్డాయని స్థానికులు ఈరోజు తెలిపారు. అదృష్టవశాత్తు క్యాంటీన్‌లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. అందులో పనిచేసే వర్కర్లు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఆర్టీసీ బస్టాండ్ పై నీరు నిల్వ ఉండడంతో కొన్నేళ్లుగా స్లాబ్ పై భాగం తడిసి శిథిలావస్థకు చేరుకుందన్నారు.అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.
Similar News
News April 13, 2026
కృష్ణా యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2026లో నిర్వహించిన BA.LLB 7వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల(2025- 26 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 20లోపు ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం సూచించింది.
News April 13, 2026
కంగ్టి గిరిజన గురుకులంలో 100% ఉత్తీర్ణత

కంగ్టిలోని గిరిజన రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 17 మంది, ద్వితీయ సంవత్సరంలో 20 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. సెకండియర్‌లో బేగరి ఈశ్వర్ 928 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.
News April 13, 2026
హైదరాబాద్: 12 గంటల్లోపే వాటర్ ట్యాంకర్ డెలివరీ

ట్యాంకర్ బుకింగ్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, రాత్రి వేళల్లో కూడా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని జూమ్ సమావేశంలో అధికారులకు MD సూచించారు.


