News September 22, 2025
బాపట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బాపట్ల జిల్లాలో కురిసే భారీవర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ సోమవారం సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇది 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఆపద సమయంలో కాల్ 97110 77372కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం 1077, రాష్ట్ర కేంద్రం 1070 టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News September 22, 2025
కర్నూలు జిల్లా ఎస్పీ పబ్లిక్ గ్రీవెన్స్‌లో 65 ఫిర్యాదులు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించి ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా విని పరిష్కార చర్యలకు ఆదేశించారు. మోసాలు, ఉద్యోగ మభ్యపాటు, అప్పుల వేధింపులు, స్కూల్‌లో ఘర్షణలు, భూ ఆక్రమణలు, పొదుపు గ్రూపుల మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.
News September 22, 2025
450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
News September 22, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.