News December 23, 2025

బాపట్లలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

image

జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన PGRSలో కలెక్టర్ పర్యాటక ప్రాంతాల సంరక్షణ, స్వచ్ఛత, మాస్టర్ ప్రణాళిక తయారీపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సూర్యలంక అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలవ్వగా, బీచ్‌ల వద్ద ప్రతి సోమవారం పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.

Similar News

News December 24, 2025

అధికారులను జైలుకు పంపిస్తాం: హరీశ్ రావు

image

పోస్టింగులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్‌కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లినా తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాలు లేకున్నా రేవంత్‌కు సహకరిస్తున్న వారిని వదలమని పేర్కొన్నారు.

News December 24, 2025

మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

image

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News December 24, 2025

95 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

image

3 రాష్ట్రాలు, ఒక UTలో SIR తర్వాత 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. MPలో 42.74 లక్షల మంది, కేరళలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఛత్తీస్‌గఢ్‌లో 27.34 లక్షల మంది, అండమాన్&నికోబార్‌లో 3.10 లక్షల మంది ఓటర్లలో 64,000 మందికి చోటు దక్కలేదు. తమ ఐడెంటిటీని వ్యక్తిగతంగా చూపించి FEB 21, 2026న ప్రచురించే తుది జాబితాలో పేర్లను చేర్చుకోవడానికి ఈ ఓటర్లకు వారం రోజుల టైం ఇచ్చారు.