News December 20, 2025

బాపట్లలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం: DMHO

image

జిల్లాలో 0-5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని శనివారం బాపట్ల DMHO డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,111 పోలియో బూత్‌లు, 4,662 మంది వ్యాక్సినేటర్లు, 113 మంది రూట్ సూపర్వైజర్లను నియమించామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 42 ట్రాన్సిట్ బూత్‌లు, 67 మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 20, 2025

‘ముస్తాబు’తో విద్యార్థుల ఆరోగ్యం: జేసీ

image

విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆరోగ్య సూత్రాలు, పరిశుభ్రత నేర్పడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని జేసీ కుమార్‌ రెడ్డి తెలిపారు. చినమిరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News December 20, 2025

పెద్దపల్లి: యాదవ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లకు కలెక్టర్ సన్మానం

image

పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మూడు నెలలు వాలంటీర్లుగా సేవలందించిన యాదవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సన్మానించారు. కే. స్వాతి, డి. సుజాత, జి. సరోజన, కె. రాజేంద్ర ప్రసాద్‌లకు శాలువాలు కప్పి ఆరోగ్యశాఖ తరఫున అనుభవ ధృవీకరణ పత్రాలు అందజేశారు. సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్‌లో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

News December 20, 2025

సిరిసిల్ల: ‘ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలి’

image

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. రైతులను కలిసి ఆయిల్ పామ్ సాగుతో లాభాలను వివరించాలని, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, మద్దతు ధర గురించి వారికి తెలియజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే సాగులో ఉన్న పంటను ఇతర రైతులకు చూపించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.