News December 17, 2025
బాపట్లలో పొగాకు గోడౌన్‌ను పరిశీలించిన ఏపీ మార్కెట్ ఛైర్మన్

ఏపీ మార్కెట్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు బుధవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని పొగాకు గోడౌన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. గోడౌన్‌లోని మౌలిక వసతులు పొగాకు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్ కరుణశ్రీ ఉన్నారు.
Similar News
News December 18, 2025
కాసులు కురిపిస్తున్న మల్లెల సాగు

AP: మల్లె పూల సాగు రైతులకు, రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మల్లె సాగు ద్వారానే వ్యవసాయ రంగంలో రూ.10,749 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో ఇది 6.06 శాతంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లె సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల రైతులు కూడా మల్లెసాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
News December 18, 2025
బాపట్ల: పిచ్చికుక్క దాడిలో 8 మంది చిన్నారులకు గాయాలు

రేపల్లెలోని ఎనిమిదో వార్డులో గురువారం దారుణం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డుపై నుంచున్న 8 మంది చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌తో పాటు అదనంగా యాంటీ రేబిస్ సీరం (ఇమ్యునో గ్లోబిలిన్) ఇంజక్షన్ ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.
News December 18, 2025
నితీశ్ కుమార్‌కు పాక్ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు!

బిహార్ CM నితీశ్ కుమార్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగిన<<>> ఘటనపై నితీశ్ క్షమాపణలు చెప్పాలని పాక్ గ్యాంగ్‌స్టర్ షహ్జాద్ భట్టి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోషల్ మీడియాలో హెచ్చరించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డాడు. ఈ బెదిరింపు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతానికి వివరాలేమీ లేవని DGP వినయ్ కుమార్ తెలిపారు.


