News December 10, 2025
‘బాపట్లలో ప్రాంతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి’

బాపట్లలో ప్రాంతీయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రం అందించారు. శిక్షణా సంస్థ ద్వారా ఆయుష్ విధానాలపై శిక్షణ, ఆయుష్ వైద్య విద్యను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో యోగ, ఆయుష్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 11, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.
News December 11, 2025
తిమ్మాపూర్ తండా సర్పంచ్‌గా లత గెలుపు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తిమ్మాపూర్ తండా సర్పంచ్‌గా మెగావత్ లత గెలుపొందారు. గుగ్లవత్ నవ్యపై 12 ఓట్ల మెజార్టీతో లత గెలిచారు. మెగావత్ లతను బీఆర్‌ఎస్ బలపరిచింది.
News December 11, 2025
బోరింగ్ తండాలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి గెలుపు

ఆత్మకూర్ ఎస్ మండలంలో ఆసక్తి రేపిన సర్పంచుల స్థానాలపై ఉత్కంఠ తొలగిపోయింది. బోరింగ్ తండా ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి బిచ్చు నాయక్ వైపే మొగ్గు చూపారు. సమీప ప్రత్యర్థిపై నయన్ ఏకంగా 134 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆత్మకూర్ ఎస్ మండలంలో కాంగ్రెస్ వర్గాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి.


