News April 7, 2025
బాపట్లలో యాక్సిడెంట్.. తల్లి, కుమారుడు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో బాపట్లలో విషాద ఛాయలు అలుము కున్నాయి.స్థానికుల వివరాల మేరకు..పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కొడుకు శివయ్య మృతిచెందగా, తల్లి చిట్టెమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 9, 2025
ట్రంప్ టారిఫ్స్‌పై మోదీ మౌనం ఎందుకు?: రాహుల్

US టారిఫ్స్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ టారిఫ్స్ విధిస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. “ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారు. RSS, BJP రెండూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని RSS పత్రిక ‘ఆర్గనైజర్’లో రాస్తున్నారు” అని పేర్కొన్నారు.
News April 9, 2025
సచిన్ తర్వాత మరో అద్భుతం ప్రియాంశ్: సిద్ధూ

CSKపై సంచలన ఇన్నింగ్స్ ఆడిన PBKS బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు కురిపించారు. ‘సచిన్ తర్వాత మరో అద్భుతాన్ని ఇప్పుడే చూస్తున్నా. CSK బౌలర్లను ఊచకోత కోయడం అమోఘం. ఇండియాకు సుదీర్ఘకాలం ఆడే సత్తా ప్రియాంశ్‌కు ఉంది. ఓడిపోతుందనుకున్న పంజాబ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొని ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు’ అని ఆయన కొనియాడారు.
News April 9, 2025
పత్తికొండ: మీ ఊర్లో నీటి సమస్య ఉందా.. ఫోన్ చేయండి!

పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే తమకు తెలియజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్ ప్రజలను కోరారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, క్రిష్ణగిరి, ఆలూరు, హాళహార్వి, ఆస్పరి, దేవనకొండ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ 8520796952కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 వరకు నీటి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.