News September 16, 2025

బాపట్లలో NDPS చట్టాలపై అవగాహన

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నారాయణ NDPS చట్టాలు, వాటి అమలుపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు.

Similar News

News September 16, 2025

అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.

News September 16, 2025

మంజీరా నది ఉరకలేస్తుంది..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.

News September 16, 2025

కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

image

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.