News September 23, 2025
బాపట్ల అధికారులకు కలెక్టర్ సూచనలు

బాపట్ల కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని మున్సిపల్ పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News September 23, 2025
జగిత్యాల: ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. ముస్లిం, సిఖ్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీలు వంటి మైనారిటీ కమ్యూనిటీల మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగల వారు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో OCT 6 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సంక్షేమ అధికారి తెలిపారు.
News September 23, 2025
‘ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ఏర్పాట్లు’

మెట్‌పల్లి మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 26న ఉన్నతాధికారులతో కలిసి ఫ్యాక్టరీని సందర్శిస్తామని, రైతులను కలుస్తామని చెప్పారు. ఈ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీ కార్యదర్శి, ఎస్పీ అశోక్ కుమార్, వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
News September 23, 2025
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

వరద విపత్తులు వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, అధికారులపై ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. విపత్తును ఎదుర్కోవడానికి సర్పంచ్‌లు, అధికారులు సంసిద్ధం కావాలన్నారు. లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తాను అండగా ఉంటానన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సమాజంలో నాయకులుగా ఉన్న సర్పంచులు ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు.