News February 9, 2025
బాపట్ల: ‘ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలి’

19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని బాపట్ల జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 10న జాతీయ నులిపురుగులు దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు అందించాలన్నారు. నులిపురుగుల వల్ల శరీరంలో రక్తహీనత, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు.
Similar News
News April 15, 2026
1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.
News April 15, 2026
మూడు జిల్లాల్లో 4 వేలకు పైగా స్లాట్ బుకింగ్స్

మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు.
News April 15, 2026
శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.


