News November 22, 2025

బాపట్ల: ‘ఈ అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తల వేతనం పెరుగనుంది’

image

బాపట్ల జిల్లాలోని 16 మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మార్పుతో కార్యకర్తల గౌరవ వేతనం రూ.7,000 నుంచి రూ.11,500కు పెరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

తిరిగి ప్రారంభమైన దక్షిణ ప్రాకారం విస్తరణ పనులు

image

వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ ప్రాకారం విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు. కాగా, భారీ బహుబలి యంత్రంతో రోడ్డుపై రంధ్రాలు చేసేందుకు ప్రయత్నించగా, రోడ్డు వెడల్పుపై స్పష్టత కోరుతూ స్థానికులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, ఇతర అధికారులు స్థానికులకు స్పష్టతనిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దీంతో పనులు పున: ప్రారంభమయ్యాృయి.

News November 22, 2025

నట్స్‌తో బెనిఫిట్స్: వైద్యులు

image

నిత్యం స్నాక్స్‌గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్‌ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.

News November 22, 2025

రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్‌

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్‌, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్‌ ఫ్రీజర్‌ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.