News January 1, 2026

బాపట్ల: ఈ-ఆటో వాహనాల ప్రారంభం

image

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు కేటాయించిన ఈ-ఆటోలు వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతగా ఎనిమిది ఆటోలు జిల్లాకు మంజూరైనట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

image

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్‌ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్‌ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.

News February 12, 2026

నంద్యాల: ఎదురు చూపులు!

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా కొత్త పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వితంతువులతో పాటు వృద్ధాప్య, కళాకారులు, ఇతర పింఛన్లకు అర్హత కలిగిన సుమారు 6 వేలకు మందిపైగా ఉన్నారు. వారంతా నూతన పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని అర్హత కలిగిన లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News February 12, 2026

సంగారెడ్డి: ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో!

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో ఎవరీ అదృష్టం వరిస్తుందో తెలియాలి అంటే 13న కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.