News March 18, 2025

బాపట్ల: ‘ఎండల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి’ 

image

ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయమ్మ తెలిపారు. మంగళవారం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో గొడుగు వినియోగించాలన్నారు. మంచి నీరు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలన్నారు.

Similar News

News March 18, 2025

ఇండియా గురించి ఈ విషయాలు తెలుసా?

image

మన దేశంలో 2024 నాటికి 143+ కోట్ల మంది జనాభా ఉండగా అందులో 136 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. 95 కోట్ల ఓటర్లుంటే 120 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 65 కోట్ల మంది ఇ-కామర్స్, 80 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు, 50 కోట్ల మంది ఓటీటీ సబ్‌స్క్రైబర్లున్నారు. UPI యూజర్లు 42 కోట్లు కాగా 28 కోట్ల మంది ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. అలాగే 39% మంది అర్బన్‌లో 61% మంది రూరల్ ఏరియాల్లో జీవిస్తున్నారు.

News March 18, 2025

దాకమర్రి లేఅవుట్ ధర తగ్గింపు: VMRDA ఎంసీ 

image

విజయనగరానికి దగ్గరలో దాకమర్రి లే అవుట్‌లో స్థలాల ధరలను గజం రూ.20వేల నుంచి రూ.15,500 తగ్గించినట్టు VMRDA ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. నివాస స్థలాలు ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వం ధరలను తగ్గించిందని చెప్పారు. ఈ లేఅవుట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

News March 18, 2025

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాల పనివేళలు ఇవే.. 

image

అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.

error: Content is protected !!