News September 14, 2025
బాపట్ల ఎంపీకి 05వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!
Similar News
News September 14, 2025
జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న అరకు ఎంపీ

తిరుపతిలో ఆదివారం జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. చట్ట సభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్ర తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.
News September 14, 2025
పాకిస్థాన్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

ఆసియాకప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: అభిషేక్, గిల్, సూర్య కుమార్(C), తిలక్ వర్మ, శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాక్: ఫర్హాన్, అయుబ్, హారిస్, జమాన్, సల్మాన్(C), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, అష్రఫ్, షాహిన్ అఫ్రిదీ, ముఖీం, అహ్మద్
*SonyLIVలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.
News September 14, 2025
HYD: భాయ్.. ర్యాలీలో మా సేవ మీ కోసం!

పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు మిరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బండ్లగూడ అధ్యక్షుడు భరత్‌కుమార్ ముస్లిం సోదరుల కోసం మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. మత సామరస్యం, సేవా దృక్పథానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు ప్రశంసించారు.