News September 15, 2025

బాపట్ల ఎంపీకి 5వ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!

Similar News

News September 15, 2025

నిర్మల్ కోటలు.. నిర్మాణ శైలికి నిదర్శనాలు..!

image

నిర్మల్ జిల్లాలోని కోటలు, కట్టడాలు నాటి వైభవానికి, అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తున్నాయి. నిర్మల్ చుట్టూ ఉన్న 32 గాడ్లు, కోటలు, సోన్ బ్రిడ్జి, గాజుల్ పెట్ చర్చి, కదిలి, దేవరకోట, ఇంకా ఎన్నో ఆలయాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరినప్పటికీ మిగిలినవి నాటి ఇంజినీర్ల పనితనానికి నిలువెత్తు నిదర్శనాలు. ఈ పురాతన కట్టడాలు నేటి ఇంజినీర్లకు సైతం సవాల్‌గా నిలుస్తున్నాయి.

News September 15, 2025

భారత్ విక్టరీ.. ముఖం చాటేసిన పాక్ కెప్టెన్

image

భారత్‌ చేతిలో ఘోర ఓటమో, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదనో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడకుండా ముఖం చాటేశారు. పీసీబీ ఆదేశాలతోనే ఆయన ఈ సెర్మనీకి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ముగిసిన వెంటనే ఓడిన జట్టు కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడతారు. మరోవైపు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా భారత్ క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిందని పాక్ ACAకు ఫిర్యాదు చేసింది.

News September 15, 2025

పటిష్టం..’పాలేరు’

image

1928లో పాలేరు చెరువు నిర్మించారు. నాటీ చీఫ్ ఇంజీనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో చతురస్రాకారం బండరాళ్లు, బంకమట్టి, డంగుసున్నం, కాంక్రీట్ లాంటి సీసంతో నిర్మించారు. చెరువు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజీనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పాలేరు చెరువు 1978లో రిజర్వాయర్‌గా మారినప్పుడు ఇంజీనీర్లు ఫాలింగ్ గేట్లు ఏర్పాటు చేసి ఘనత సాధించారు. నేడు ఇంజీనీర్స్ డే.