News January 5, 2026
బాపట్ల: ఎస్పీ కార్యాలయ పీజీఆర్ఎస్‌కి 67 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 67 అర్జీలు అందినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Similar News
News February 20, 2026
HYD: మలి దశను మలుపు తిప్పిన మహోద్యమలు

ప్రత్యేక తెలంగాణ సాధనకు హైదరాబాద్ ఉద్యమాలకు కేంద్రబిందువైంది. ‘మిలియన్ మార్చ్’ ఉప్పెనలా ఉప్పొంగింది. ‘సాగరహారం’ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరిపోసింది. ‘సకలజనుల సమ్మె’ రాష్ట్రాన్ని స్థంభింపజేసింది. ‘మానవహారం’ ఉద్యమ ఆత్మను ప్రతిబింబించాయి. ‘సడక్‌బంద్’ సమైక్య పాలకులకు సమస్య తీవ్రతను చాటిచెప్పింది. చివరకు 2014 FEB 20న RSలో బిల్లు పాసై నాలుగున్నర కోట్ల మోముల్లో నవ్వులు పూశాయి.

ఫోన్‌పేలో బయోమెట్రిక్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

రూ.5వేల లోపు ట్రాన్సాక్షన్ల కోసం ఫోన్‌పే <<19185907>>బయోమెట్రిక్<<>> ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఫోన్‌పే యాప్‌లో ఎడమ వైపు కార్నర్‌లో ఉండే ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో మేనేజ్ పేమెంట్స్‌పై క్లిక్ చేస్తే కింద Biometric Pay కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఇందుకోసం ప్లేస్టోర్‌లో యాప్ అప్‌డేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ iOS యూజర్లకు అందుబాటులో లేదు.