News March 30, 2025

బాపట్ల కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

image

బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఉగాది వేడుకలను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 1, 2025

కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

కూల్ డ్రింక్స్‌ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్‌ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్‌తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

News April 1, 2025

ఈనెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్‌: విశాఖ డిఈవో

image

జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కళాశాలలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు డిఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 900 మంది ఉపాధ్యాయులు, అధికారులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.

News April 1, 2025

నంద్యాల జిల్లాలో 84.63% పెన్షన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల సమయానికి నంద్యాల జిల్లాలో 84.63% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గాను, 1,81,608 మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ సొమ్మును అందజేశారు.

error: Content is protected !!