News February 3, 2025

బాపట్ల కలెక్టర్‌ను కలసిన ట్రైనీ డీఎస్పీ

image

బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళిని ట్రైనీ డీఎస్పీ ఆర్ అభిషేక్ మర్యాదపూర్వకంగా కలిసారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌ను డీఎస్పీ కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన తనకు జిల్లాతో ఉన్న అనుబంధం గురించి, శాంతి భద్రతలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News November 4, 2025

రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

image

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.

News November 4, 2025

కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయన కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ నుంచి కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు మొదలవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర, తదితరులు పాల్గొన్నారు.

News November 4, 2025

కాకినాడ జిల్లాలో 20,113 హెక్టార్లలో పంట నష్టం అంచనా.!

image

కాకినాడ జిల్లాలో 20,113 హెక్టార్లలో 45 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక పంపారు. దీనిపై అభ్యంతరాలు తీసుకున్నారు. బుధవారం తుది జాబితాను ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున పరిహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.