News December 21, 2025
బాపట్ల: కలెక్టర్ కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో..!

బాపట్ల కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ ఆదివారం స్థానిక ఏరియా వైద్యశాలను కుటుంబ సమేతంగా సందర్శించారు. తన కుమారుడికి స్వయంగా పోలియో చుక్కలు వేయించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
Similar News
News December 22, 2025
కామారెడ్డి: టెంపరేచర్ డౌన్.. ప్రజలు జాగ్రతగా ఉండాలి

కామారెడ్డి జిల్లాలో 17 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 10°Cల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యినట్లు వెల్లడించారు. మిగతా 17 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ జారీ కాగా 15°Cల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, త్వరగా ఇళ్లకు చేరుకోవాలని తెలియజేస్తున్నారు.
News December 22, 2025
105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.
News December 22, 2025
మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.


