News November 18, 2025

బాపట్ల: ‘కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత’

image

పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు.

Similar News

News November 18, 2025

SRCL: ఎస్సీ వసతి గృహాల వస్తువులకు టెండర్లు

image

జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు అందించాల్సిన వస్తువులు, పరికరాల సరఫరా కోసం పిలిచిన టెండర్లను మంగళవారం ఓపెన్ చేశారు. కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సమక్షంలో ఈ టెండర్లను పరిశీలించారు. జామెట్రీ బాక్స్, స్కేల్, వరల్డ్ మ్యాప్, స్టడీ చైర్, దుప్పట్లు, సీసీ కెమెరాలు మొదలైన వస్తువుల సరఫరాకు వచ్చిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు.

News November 18, 2025

10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

image

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

News November 18, 2025

ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.