News January 1, 2026

బాపట్ల: కొత్త ఏడాదైనా ‘కంది’ కరుణించేనా..?

image

కొరిశపాడు మండలంలోని 43 చౌకధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ గురువారం మొదలవగా, కందిపప్పు సరఫరాపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. గత సంవత్సరం తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం నుంచి కందిపప్పు ఆశించిన స్థాయిలో అందలేదని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కొత్త ఏడాదిలోనైనా అందిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంక్రాంతికి కిలో గోధుమ పిండిని రూ.20కే సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News January 1, 2026

AMP: పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్న కలెక్టర్, ఎస్పీ

image

నూతన సంవత్సరం పురస్కరించుకొని అమలాపురంలో కలెక్టర్ మహేశ్ కుమార్‌ను ఎస్పీ రాహుల్ మీనా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కూడా ఎస్పీకి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలందరికీ అంతా మంచే జరగాలని, అభివృద్ధి పథంలో జిల్లా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

News January 1, 2026

ఈ నెల 3న మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

image

ఈ నెల 3న లోక కల్యాణార్థమై శ్రీశైలంలో శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. 2న రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 3న నందివాహన సేవ, గ్రామోత్సవం జరిపిస్తారు.

News January 1, 2026

నీటిపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా?: హరీశ్

image

TG: నదీ జలాలపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా? అని BRS నేత హరీశ్ CM రేవంత్‌పై ధ్వజమెత్తారు. ‘మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చారు, సుంకిశాలను ఎలా కూల్చారో చూపిస్తారా? కృష్ణాపై హక్కులను KRMBకి ఎలా అప్పగించారో చెబుతారా?’ అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా? అని నిలదీశారు. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.