News December 22, 2025

బాపట్ల: కోడి గుడ్డు ధరకు రెక్కలు..!

image

తక్కువ ధరకు లభించే పౌష్టికాహారమైన కోడిగుడ్ల ధర ఆకాశాన్నంటింది. మేదరమెట్లలో కోడిగుడ్ల ధరలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఒక్కో గుడ్డు ధర రూ.7.30 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.8కి విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్డు ఏకంగా రూ.15 పలుకుతోంది. దాణా, నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైతులు ఫారాలను మూసివేస్తుండటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.

Similar News

News December 26, 2025

కొత్త ఏడాదిలో ఇవి మారుతాయి!

image

కొత్త ఏడాదిలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*8వ వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే ఛాన్స్.
*పలు బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, సవరించిన FD రేట్లు జనవరి నుంచి అమల్లోకి.
*బ్యాంకింగ్ సర్వీసులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి.
*PM కిసాన్ సాయం పొందేందుకు యూనిక్ ID కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం.
*LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు.

News December 26, 2025

BHELలో అప్రెంటిస్ పోస్టులు

image

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(<>BHEL)<<>> హరిద్వార్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. B,Tech, BE, డిప్లొమా అర్హతగల వారు JAN 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com

News December 26, 2025

ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ పని చేయకపోవడానికి కారణాలు

image

ఫెలోపియన్ ట్యూబ్స్‌‌లో సమస్యలు చాలా తక్కువమందిలో కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఇన్‌ఫెక్షన్లు కలగడం, ట్యూబ్ దెబ్బతినడం లేదా తొలగిపోవడం వల్ల, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల శాశ్వతంగా ఫెలోపియన్ ట్యూబ్‌ దెబ్బతినడం లేదా ఆ ట్యూబ్‌ని తీసివేయడం, పుట్టుకతోనే ఫెలోపియన్ ట్యూబ్‌ అసాధారణ రీతిలో అభివృద్ధి చెందడం, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ పనిచేయకపోవచ్చంటున్నారు.