News March 2, 2025

బాపట్ల: కౌంటింగ్‌కు మరికొన్ని గంటలే సమయం.. సర్వత్రా ఉత్కంఠ

image

MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

Similar News

News November 5, 2025

శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

శ్రీశైలంలో ఇవాళ జరిగే జ్వాలాతోరణం, ఈనెల 14న జరిగే కోటి దీపోత్సవానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించే చోట పోలీసుల ఆదేశాలు, సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలన్నారు.

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.

News November 5, 2025

మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

image

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.