News December 22, 2025

బాపట్ల: గుప్త నిధుల వేట ముఠా అరెస్ట్

image

గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్న ఐదుగురి సభ్యుల ముఠా అద్దంకి RTC బస్టాండ్ వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడింది. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అనుమతి లేని KS-700 స్కానర్, మెటల్ డిటెక్టర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI సుబ్బారాజు తెలిపారు.

Similar News

News December 23, 2025

నంద్యాల: ‘హాయ్’ అని పెడితే FIR కాపీ

image

వాట్సాప్‌లో 95523 00009కు ‘హాయ్’ అని పెడితే FIR కాపీ పంపించేలా చర్యలు చేపట్టామని నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాట్సాప్ గవర్నన్స్ తెచ్చిందన్నారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి FIR కాపీ కోసం గతంలో బాధితులు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం ఇకపై వాట్సప్‌లోనే ఈ సౌకర్యం పొందే వెసులుబాటు కల్పించిందని వెల్లడించారు.

News December 23, 2025

549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్(GD) పోస్టుల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసై, క్రీడల్లో రాణిస్తున్న 18-23 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. DEC 27 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: rectt.bsf.gov.in/

News December 23, 2025

WNP: రోడ్డు ప్రమాదాల నివారణకు నివేదిక ఇవ్వండి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నివేదికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు. రోడ్డుపై ప్రమాదం సంభవిస్తే 1033కు ఫోన్ చేయాలనే విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు.