News July 9, 2025
బాపట్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

బాపట్ల మండలం కప్పలవారిపాలెం గ్రామం సమీపంలోని నాగరాజు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. బాపట్ల రూరల్ పోలీసులు కథనం మేరకు.. కప్పల వారి పాలెం గ్రామంలోని నాగరాజు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News July 10, 2025
ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు చేయాలి: ఇంఛార్జి పీవో

ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయాలని ఐటీడీఏ ఇంఛార్జి పీఓ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో గ్రామ సచివాలయం, ఐసీడీఏస్ ఇతర అధికారులతో చిన్నారులకు ఆధార్, జనన దృవీకరణ పత్రాల జారీపై సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో 4,765 మంది పిల్లలకు ఆధార్ కార్డులు, 3,484 మందికి జనన దృవీకరణ పత్రాలు లేవన్నారు. ఈ నెలాఖరులోగా ఆధార్ జారీ చేయాలని సూచించారు.
News July 10, 2025
ASF కలెక్టర్, ఎస్పీని కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

ASF జిల్లాలో ఇటీవల ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ఆయనతో పాటు సభ్యులు సదాశవ్, సంతోష్, మినేష్ తదితరులున్నారు.
News July 10, 2025
జగిత్యాల: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా డా.షర్మిళ

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా డా.జి.షర్మిళను నియమిస్తూ తెలంగాణ హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ శాఖ అధికారులు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. CKM వరంగల్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న షర్మిళ ప్రిన్సిపల్‌గా నియామకమయ్యారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ డా.ఎం.జి.కృష్ణమూర్తి నియమితులయ్యారు.