News December 13, 2025
బాపట్ల: ‘గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు అనుమతివ్వాలి’

బాపట్ల MP, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (RT&H) కార్యదర్శి వి.ఉమాశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని “చెందోలు- నిజాంపట్నం – నారోకోడూరు- గుంటూరు” ఫిషింగ్ హార్బర్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టు DPR అలైన్‌మెంట్‌కు త్వరగా ఆమోదం ఇవ్వాలని MP తెన్నేటి విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 3, 2026
ఆసిఫాబాద్: ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న కళ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, ఇంగ్లిష్ మాధ్యమం అందుబాటులోకి తెచ్చినా ఫలితం ఉండటం లేదు. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, ఉపాధి వలసలు దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో అమలు లోపాలను సరిదిద్ది, గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేయకపోతే సర్కారీ విద్య మరింత కుదేలయ్యే ప్రమాదముందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 3, 2026
ముచ్చటగా మూడోసారి ఎవరిదో పైచేయి!

T20 WC సెమీస్‌లో ఎల్లుండి IND-ENG తలపడనున్నాయి. WC చరిత్రలో 2జట్లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలిచాయి. 2022 WC సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ గెలవగా 2024లో ఇంగ్లిష్ జట్టును ఇండియా చిత్తు చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 2సార్లు సెమీస్‌లో గెలిచిన జట్టే అంతిమంగా టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎవరు గెలిచి కప్పు కొడతారనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నాయి.
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్‌లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.


