News December 28, 2025

బాపట్ల జిల్లాకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ గోల్డెన్ సాండ్స్‌కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం గవర్నర్ బాపట్ల పర్యటనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 2, 2026

సరస్వతి దేవి వీణానాదం – మనసుకు అమృతం

image

చదువుల తల్లి సరస్వతీ దేవి చేతిలో వీణ ఉంటుంది. అందులో నుంచి వచ్చే సప్తస్వరాల తరంగాలు మన మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తాయి. రోజూ శాస్త్రీయ సంగీతం వింటే మనస్సు ప్రశాంతంగా మారి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఈ నాదం విద్యార్థులకు, మేధావులకు ఎంతో మేలు చేస్తుంది. దైవత్వం అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన జీవనశైలిని మెరుగుపరిచే ఒక గొప్ప విజ్ఞానం కూడా!

News January 2, 2026

త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

image

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే AEలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

News January 2, 2026

కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

image

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.