News March 12, 2025
బాపట్ల జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ IAS అధికారులు కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు, కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాల్ని సరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News April 5, 2026
వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 5, 2026
ఖానాపూర్: బీజేపీ ఛైర్ పర్సన్.. బీఆర్ఎస్ వైస్ ఛైర్మన్

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఛైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్‌కు దక్కింది. ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోహెబ్ ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
News April 5, 2026
MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్‌కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.


