News February 24, 2026

బాపట్ల జిల్లాలోని 10 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలోని పది గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. మొత్తం 6,400 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1,287 మందికి అందజేశామన్నారు. మిగిలిన పుస్తకాలను అర్హులకు తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియ 68.32 శాతానికి చేరిందన్నారు.

Similar News

News February 25, 2026

ఈ నెల 28న టీయూలో జాతీయ సెమినార్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (లండన్) సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించనున్నట్లు డా.వాసం చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ సెమినార్ పోస్టర్లను వీసీ ఆచార్య యాదగిరిరావు బుధవారం ఆవిష్కరించారు. రసాయన, జీవ రసాయన పురోగతిపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొ.రాంబాబు, ప్రొ.ఆంజనేయులు, డా.సాయిలు పాల్గొన్నారు.

News February 25, 2026

SRCL: ‘ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలి’

image

ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ముందుగా గత నెలలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. రవాణా, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన సర్వే వివరాలపై ఆరా తీశారు. అన్ని పెట్రోల్ బంక్ లలో కచ్చితంగా ‘నో హెల్మెట్ .. నో పెట్రోల్’ అమలు చేయాలని సూచించారు.

News February 25, 2026

రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్: హరీశ్ రావు

image

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.