News March 7, 2025
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 270 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షకు 270 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 8,390 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 8120 మంది పరీక్షలకు వచ్చారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Similar News
News April 15, 2026
నాతవరం జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నాతవరం మండలం గన్నవరం గ్రామ పరిసర జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి (40) మృతిచెందాడు. సమాచారం అందుకున్న SI వై.తారకేశ్వరరావు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు 4-5 రోజుల క్రితమే మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మృతుడు నలుపు షార్ట్, చెక్స్ షర్ట్, క్రాక్స్ చెప్పులు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని SI కోరారు.
News April 15, 2026
హార్ముజ్ బ్లాక్.. ఇరాన్‌కు ఎంత నష్టమంటే?

పశ్చిమాసియాకు అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని <<19639152>>యుద్ధ నౌకలతో<<>> అమెరికా బ్లాక్ చేయడం తెలిసిందే. ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ 435 మిలియన్ డాలర్ల(రూ.4 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దిగ్బంధనం లేని ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని Kpler తెలిపింది. ఆ క్రూడ్‌ను ఎగుమతి చేసేందుకు ఛాన్స్ ఉంది.
News April 15, 2026
తిరుచానూరులో మిథాలి రాజ్ పూజలు

మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


