News February 21, 2026
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాస్తున్నారంటే?

బాపట్ల జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,619 మంది బాలురు, 5,125 మంది బాలికలు హాజరుకానుండగా మొత్తం 9,744 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 4,860 మంది బాలురు, 4,428 మంది బాలికలు కలిసి 9,288 మంది హాజరుకానున్నారు. మొత్తం జిల్లాలో 19,032 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు.
Similar News
News February 21, 2026
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఇంటర్ బోర్డు

AP: ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉ.9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని పేర్కొంది. ఫస్ట్, సెకండియర్ కలిపి 10,57,312 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు.
News February 21, 2026
మెటర్నిటీ లీవ్ గురించి తెలుసా?

మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళలకు గర్భం దాల్చిన సమయంలో ప్రత్యేకహక్కులు ఉన్నాయి. మొదటి ఇద్దరు పిల్లలకు 26 వారాల పెయిడ్ లీవ్స్ అందించాలి. తదుపరి పిల్లలకు 12 వారాల పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు లేదా సరోగసీ పేరెంట్స్ కూడా 12 వారాల సెలవు పొందవచ్చు. ఈ లీవ్స్ తీసుకున్నందుకు కంపెనీలు మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేవు.
News February 21, 2026
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.


