News December 21, 2025

బాపట్ల జిల్లాలో ఎంతమందికి పోలియో చుక్కలు వేశారంటే..!

image

బాపట్ల జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు DMHO విజయమ్మ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1,45,098 మంది చిన్నారులు ఉండగా వారిలో 1,09,683 మందికి ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన పిల్లలకు సోమ, మంగళవారం వైద్య సిబ్బంది గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు సహకరించాలన్నారు.

Similar News

News December 22, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13540
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12457
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2080.

News December 22, 2025

TPT: పరిశ్రమ ప్రతినిధులకు మంచి అవకాశం

image

తిరుపతి జిల్లాలోని పరిశ్రమల ప్రతినిధులకు మంగళవారం నుంచి రెండు రోజులు ఉచిత వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (VDP) నిర్వహించనున్నారు. తిరుచానూరు సమీపంలోని లెమన్ ట్రీ ప్రీమియర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి ఉన్న MSME యాజమాన్యాలు https://forms.gle/xYYUuZbrFAntCUj5A వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

News December 22, 2025

జనగామ: అంబులెన్స్‌లో వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం

image

జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ అంబులెన్స్‌లో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారిణిగా ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్ గొల్లపల్లి అలేఖ్య అనారోగ్యంతో ఉండగా అంబులెన్స్‌లో వచ్చి మరీ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్‌గా గొల్లపల్లి పర్షయ్య ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.