News November 9, 2024

బాపట్ల జిల్లాలో దారుణ ఘటన

image

నిజాంపట్నం మండలం జంపనివారిపాలెంలో శుక్రవారం సాయంత్రం పొలంలో తల్లి కొడుకు పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంచినీళ్లు తీసుకురావడానికి కొడుకు వెళ్లాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. తల్లి కేకలు విని కొడుకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను దూరంగా నెట్టివేశాడు. విషయం బయటకి చెప్తే చంపుతామని దుండగులు బాధితులను బెదిరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 15, 2026

మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కళ్యాణ్

image

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించి నేడు 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని పవన్ తెలిపారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.

News February 15, 2026

బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

image

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.