News December 26, 2025

బాపట్ల జిల్లాలో నిధుల వినియోగంపై పాలకులకు ఆంక్షలు..!

image

బాపట్ల జిల్లాలో సర్పంచ్, MPTC, ZPTC పదవీకాలం మరో 3 నెలల్లో ముగియనుంది. పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పదవీకాలం పూర్తయ్యేలోపు నిధులను ఖాళీ చేసేందుకు కొందరు ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బిల్లులూ చెల్లించవద్దని అధికారులు ఆదేశించారు.

Similar News

News December 27, 2025

మంత్రి రవీంద్ర పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

image

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

News December 27, 2025

అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

image

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.

News December 27, 2025

విశాఖలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

image

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.