News March 1, 2025
బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 10,838 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నేపథ్యంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే 08643 220182 కంట్రోల్ రూము నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST
Similar News
News March 1, 2025
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌పై వెళ్తున్న శివ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జి. కళాధర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
News March 1, 2025
లక్కర్ దొడ్డి: గుండెపోటుతో వ్యక్తి మృతి..!

నర్వ మండల కేంద్రంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల వివరాలిలా.. లక్కర్ దొడ్డి గ్రామానికి చెందిన అవుసలి బాలకృష్ణయ్య(80) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మృతిచెందారు.
News March 1, 2025
పచ్చబొట్లతో HIV, హెపటైటిస్ ముప్పు!

పచ్చబొట్లు వేసేందుకు వాడుతున్న ఇంక్, అపరిశుభ్రత విధానాలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. నాసిరకం రసాయనాలు వాడి వేస్తున్న టాటూలలో చర్మ క్యాన్సర్ వస్తున్నట్లు నిర్ధారించింది. అలాగే రోడ్డు పక్కన శుభ్రత లేకుండా, సూది మార్చకుండా పచ్చబొట్టు వేస్తుండటంతో HIV, హెపటైటిస్ సోకుతున్నట్లు వైద్యశాఖ తెలిపింది. పచ్చబొట్లపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ ప్రభుత్వం కోరింది.