News March 28, 2025
బాపట్ల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు ఇవే.!

*బాపట్లలో పర్యాటక రంగ విస్తరిస్తుంది: మంత్రి కందుల*మెగా డీఎస్సీకి హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ* అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు *జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ కీలక సూచనలు*హెలిప్యాడ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్ * మానవత్వం చాటుకున్న మంత్రి కందుల
Similar News
News February 13, 2026
కొత్తగూడెంలో కొత్త కార్పొరేటర్ ‘కిడ్నాప్’ కలకలం..!

కొత్తగూడెం మేయర్ పీఠం దక్కించుకునే క్రమంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 32వ డివిజన్ నుంచి BRS తరఫున గెలిచిన కార్పొరేటర్ గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు రాంబాబు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
News February 13, 2026
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.
News February 13, 2026
మేడ్చల్: పురపోరులో ఎగిసిన ‘యువ’ కెరటాలు

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఐదుగురు యువ కౌన్సిలర్లు గెలుపొందారు. 7వ వార్డు నుంచి బందేల కుమార్, 8వ వార్డు లావుడ్య శ్రీదేవి, 11వ వార్డు గోషిక అఖిల, 18వ వార్డు ఓం ప్రకాశ్ గౌడ్, 10వ వార్డు నిరుగంటి శ్రీలత గెలుపొందారు. 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులలో ఐదుగురు యువ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం మేడ్చల్ మండల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఐదుగురు BRS పార్టీ నిలబెట్టినవారే.


