News April 1, 2026

బాపట్ల జిల్లాలో పరార్.. హైదరాబాద్‌లో పట్టివేత

image

నగరం మండలం కట్టావ గ్రామానికి చెందిన అల్తాఫ ఖాన్‌ క్రైమ్ నంబర్ 59 బార్ 2019 కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతను కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నందున NBW చేసినట్లు నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపారు. నిందితుడిని హైదరాబాదులో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. నిందితుడికి కోర్టు 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు.

Similar News

News April 13, 2026

అనకాపల్లి చేరిన రామతీర్థం రాములోరి శోభాయాత్ర

image

విజయనగరం జిల్లా రామతీర్థం నుంచి బయలుదేరిన శోభాయాత్ర అనకాపల్లి బైపాస్ రోడ్డు తోటాడ జంక్షన్ వద్దకు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానం తరపున దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు, 50 మంది భక్తుల సమక్షంలో శ్రీరాములవారి జీర్ణోద్ధారణ నిమర్జన మహోత్సవం నిర్వహిం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం ఛైర్మన్ పీలా నాగ శ్రీను, డిప్యూటీ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.

News April 13, 2026

వనపర్తి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

వనపర్తి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా వీపనగండ్లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దగడ, పెద్దమందడి, పానుగల్‌తో పాటు పలు మండలాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 13, 2026

అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

image

లోక్‌సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్‌‌ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.