News April 15, 2025
బాపట్ల జిల్లాలో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

బాపట్ల జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలు, రిసార్ట్‌లు, దాబాలలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. క్రికెట్ బెట్టింగులు అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను క్రికెట్ బెట్టింగ్‌కు ప్రోత్సహిస్తే సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
హసన్‌పర్తి: గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి శివారులో 2017లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురికి 8 సంవత్సరాల తర్వాత పదేళ్ల జైలు శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో, నిందితులైన లావుడ్య భద్రమ్మ, దుప్పటి మల్లయ్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పునిచ్చారు.
News September 19, 2025
నల్గొండ: జిల్లాలో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జులై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య వెయ్యికి పైగా చేరాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం వందల సంఖ్యలో మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కార్లు, బైక్లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. దీంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు.
News September 19, 2025
SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.