News February 27, 2025
బాపట్ల జిల్లాలో వారికి మాత్రమే సెలవు

ఇవాళ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సెలవు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ వెంకట మురళి ప్రకటన చేశారు. ఈ సెలవు కేవలం బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గ పరిధిలోని మండలాలకే వర్తిస్తుంది. చీరాల, అద్దంకి, పర్చూరు పరిధిలో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయి.
Similar News
News December 30, 2025
తిరుపతి: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.
News December 30, 2025
అమలాపురం: ‘దానా పథకం సత్ఫలితాలను ఇస్తోంది’

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలవుతున్న ‘దానా’ పథకం సత్ఫలితాలను ఇస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ, పీఏసీఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా పాడి రైతులకు చేకూరుతున్న లబ్ధి, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, దీనిని మరింత సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 30, 2025
CETs తేదీలు ఖరారు.. చెక్ చేసుకోండి

తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వెల్లడయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మా అనుబంధ కోర్సుల అడ్మిషన్లకు గల EAPCET 2026 మే 4- 11 తేదీల మధ్య ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక MBA/MCA ప్రవేశాల కోసం ICETను మే 13, 14 తేదీల్లో B.Ed ఎంట్రన్స్ టెస్ట్ EDCETను మే 12న నిర్వహిస్తామని తెలిపింది. మిగతా పరీక్షల షెడ్యూల్, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు పై ఫొటోలో వివరంగా పొందండి.
Share It


