News December 23, 2025

బాపట్ల జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తికి భారీ పరిశ్రమ ఏర్పాటు

image

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో 1,591.17 ఎకరాల భూమికి సహకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అన్నారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టి, ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News December 23, 2025

నల్గొండ: విద్యార్థులకు అలర్ట్.. ఫీజు గడువు పెంపు

image

MGU పరిధిలోని ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ విద్యార్థులకు కీలక ప్రకటన వెలువడింది. సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షల ఫీజును ఎలాంటి జరిమానా లేకుండా జనవరి 2 వరకు చెల్లించవచ్చని డాక్టర్‌ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. లేట్ ఫీజుతో జనవరి 5 వరకు సమయం ఉందని, విద్యార్థులు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పరీక్షల తేదీలను అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలోనే పొందుపరుస్తామన్నారు.

News December 23, 2025

దశాబ్దాల భూ సమస్యకు మోక్షం.. కలెక్టర్‌కు సన్మానం

image

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్‌ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 23, 2025

సింహాచలం: ఆన్‌లైన్‌‌లో వైకుంఠ ఏకాదశి టికెట్లు

image

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈవో సుజాత సోమవారం తెలిపారు. 100,300,500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి టికెట్లు ఆన్‌లైన్‌‌లో మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు గమనించాలని సూచించారు